Kalvakuntla Kavitha: ఉగాదికి వస్తున్నాం.. పార్టీపై కవిత కీలక ప్రకటన

 


Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం నాడు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం తెలంగాణ జాగృతి సంస్థనే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు కవిత వెల్లడించిన సంగ‌తి తెలిసిందే.
తాజాగా వచ్చే ఉగాది పర్వదినం నాడు జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మార‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కవిత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వ‌హించన్న‌ట్లు స‌మాచారం. ఈ సమావేశంలో పార్టీ ఖరారు చేసే అవకాశం ఉంది. దళితులు, బహుజనులు, నిరుద్యోగుల సంక్షేమమే అజెండాగా తమ పార్టీ పని చేస్తుందని క‌విత పేర్కొన్నారు. వామపక్ష భావజాలం ఉన్నవారు, మావోయిస్టు సానుభూతిపరులు తమతో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని, రాజకీయ అస్తిత్వం కోసమే ఈ కొత్త ప్రయాణం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow