యాదాద్రి భువనగిరి: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న IAS, IPS అధికారులు


 

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహాలు ఆర్భాటంగా మారుతున్న తరుణంలో.. ఇద్దరు యువ అధికారులు తమ పెళ్లిని అత్యంత నిరాడంబరంగా జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి చౌటుప్పల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం చట్టబద్ధంగా, రెండు సంతకాలతో వివాహం చేసుకున్నారు. ఈ ఆదర్శవంతమైన వివాహ వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రస్తుత సమాజంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహం అంటే కోట్ల రూపాయల ఖర్చు, ఆర్భాటాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటామనే ఆలోచనతో ఖర్చుకు ఏమాత్రం వెనకడకుండా ఘనంగా చేసుకుంటున్నారు. కొందరైతే అప్పులు చేసి మరీ.. పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కానీ.. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు యువ అధికారులు తమ పెళ్లిని అత్యంత సాదాసీదాగా జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఈ అరుదైన, ఆదర్శవంతమైన వేడుకకు వేదికైంది. ఎటువంటి బ్యాండ్‌ మేళాలు, ఆడంబరాలు లేకుండా కేవలం చట్టబద్ధంగా రిజిస్టర్ వివాహం చేసుకొని ఈ జంట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శేషాద్రిని రెడ్డి 2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వరుడు నెలటూరి శ్రీకాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన వారు. ఆయన 2025 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. పెద్దలు కుదిర్చిన ఈ వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. విలాసాలకు వెళ్లకుండా నిరాడంబరంగా ఉండాలని ఈ యువ అధికారులు నిర్ణయించుకోవడం విశేషం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow