భర్తతో కొంత కాలంగా గొడవలు జరగడంతో ఝాన్సీ తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం గురించి తెలిసిన శ్రీను రగిలిపోయాడు. ఇటీవల రిమాండ్‌లో ఉన్న అతన్ని కలవడానికి వెళ్లిన ఝాన్సీతో ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. శ్రీను బయటకు వస్తే తమను చంపేస్తాడన్న భయంతో తాము అతన్ని హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం గుంటూరుకు చెందిన ఒక గ్యాంగ్‌తో రూ.2లక్షలు సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకుంది.
ఒంగోలు నుంచి బెయిల్‌పై వచ్చిన శ్రీనును చిమకుర్తి- పొదిలి మధ్య చంపాలని స్కెచ్ వేశారు. కానీ అది కుదరలేదు. చివరకు పెద్దారవీడు అంకారమ్మ గుడి సమీపంలో కారు ఆపారు. అప్పటికే బండిపై వచ్చిన సూర్యనారాయణ, అతని స్నేహితుడు.. శ్రీను కళ్లలో కారం కొట్టగా, కత్తితో భార్య, ఆమె తమ్ముడు పొడిచారు. దీంతో లాలు శ్రీను విలవిలలాడుతూ అక్కడే చనిపోయాడు. ఎలాగో పట్టుపడతామని భావించిన ఝాన్సీ, ఆమె తమ్ముడు ఇద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారినీ త్వరలో పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తాం' అని డీఎస్పీ నాగరాజు తెలిపారు.
Tags
Telangana