అక్రమంగా ఇసుక రవాణా, పిల్టర్ తయారు చేస్తున్నారనే సమాచారంతో రాజాపూర్ మండల రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు.
రాజాపూర్ : మండల కేంద్రంలో మంగళవారం రాజాపూర్ శివారులో అక్రమంగా ఇసుక రవాణా, పిల్టర్ తయారు చేస్తున్నారనే సమాచారంతో రాజాపూర్ మండల రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తన సొంత మండలం అయినా రాజాపూర్ మండలంలో ఫిల్టర్ ఇసుక అక్రమ ఇసుక రవాలను అడ్డుకట్ట వేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చారని.. వచ్చేది వేసవి కాలం కావడంతో ఇప్పటి నుంచి అయినా అక్రమ ఇసుక రవాణాలను నిలిపివేస్తారో లేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Tags
mahabubnagar