నకిలీ పత్రాలతో భూమి కాజేసిన‌ వారిపై చర్యలు తీసుకోండి : బాధితురాలు బాల‌మ్మ


 

తాతల కాలం నుంచి ఉన్న భూమి కి నకిలీ ధృవీకరణ పత్రాలు, సబ్ సర్వే నెంబర్లు సృష్టించి భూమి కాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన బాధితురాలు బాలమ్మ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.


వెల్దండ : తాతల కాలం నుంచి ఉన్న భూమి కి నకిలీ ధృవీకరణ పత్రాలు, సబ్ సర్వే నెంబర్లు సృష్టించి భూమి కాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన బాధితురాలు బాలమ్మ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 315/ఉ లో 2.24 ఎకరాలు, 311/ఉ ఏడు గుంటల భూమి 1953 నుంచి మా తండ్రి పల్లె జంగయ్య పేరిట పట్టా ఉంది. అప్ప‌టి నుంచి మేము సాగు చేశామ‌ని.. ఆయన మరణానంతరం భూమిని మా సోదరుడు రామస్వామి సాగు చేస్తున్నారన్నారు. భూమి వివరాలు ధరణిలో సైతం నమోదయి ఉన్నాయని ఆ భూమిని వారసత్వం కింద తన పేరిట మార్చాలని 2024లో తహ‌శీల్దార్ కు తాను దరఖాస్తు చేసినట్లు చెప్పారు. అదే సమయంలో తమ సర్వే నెంబర్ల కు సబ్ సర్వే నెంబర్లు సృష్టించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతరుల పేరిట మార్చారని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow