బొగ్గు స్కామ్ పై స‌మాధానం చెప్పే ద‌మ్ము లేక‌నే సీఎం నోటీసుల డ్రామా


 

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు మాజీ మంత్రి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డా.సి.లక్ష్మారెడ్డి.

 జ‌డ్చ‌ర్ల : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు మాజీ మంత్రి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డా.సి.లక్ష్మారెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుంది అని ఆరోపించారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రామా ఆడుతున్నారని, పాలన వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారని..కేసిఆర్ వెంట తెలంగాణ సమాజం అంతా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులకు,నోటీసులకు భయపడేది లేదని అక్రమ కేసులపై ప్రజా క్షేత్రంలోనే బీఆర్ఎస్ తేల్చుకుంటుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow