అయ్యప్ప మాలలో శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
జడ్చర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మరియు ఆయన తనయుడు అయిన మణికంఠతో శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. బుధవారం కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇరుముడిని తలపై మోస్తూ పదునెట్టాంబడి ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని, అందరికీ అయ్యప్ప స్వామి దీవెనలు అందాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని పేర్కొన్నారు.
Tags
Jadcherla