ప్రస్తుతం నడుస్తున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ బాయ్ కాట్ తో అధికార కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కుల అంశమే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. నీటి వాటా హక్కులపై చర్చకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై శాసనసభ సమావేశాల్లో మాట్లాడకపోవడం.. అసెంబ్లీ షెషన్స్ బాయ్ కాట్ చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

 



 ప్రస్తుతం నడుస్తున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ బాయ్ కాట్ తో అధికార కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కుల అంశమే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. నీటి వాటా హక్కులపై చర్చకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై శాసనసభ సమావేశాల్లో మాట్లాడకపోవడం.. అసెంబ్లీ షెషన్స్ బాయ్ కాట్ చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపారు. వారి పాలనలోనే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణలు గుప్పించారు. ఇటు సీఎం సైతం బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ తీసుకున్న బాయ్ కాట్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. తమ హయాంలో జరిగిన అవినీతి బయటికి వస్తుందనే భయంతోనే సభకు రాలేదని ఆరోపణలు గుప్పించారు.

సీఎం ఏమన్నారంటే..

‘గత రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు.. సభకు రండి అని నేను పదేపదే విజ్ఞప్తి చేశా..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాలేదు.. సభలోకి రాం. చర్చలో పాల్గొనబోమని హరీశ్ రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమే అవుతుంది. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఒడదీస్తామన్నారు. తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడారు. వారు సభలో చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు.. ఎవరి తోలు ఎవరు తీస్తారనేది రాష్ట్ర ప్రజలకు తెలిసేది..’ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

మంత్రుల మాటల దాడి

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల నీటివాటాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు చేశారని ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘నదీజలాల విషయంలో తెలంగాణ హక్కులు వంటి కీలకమైన అంశంపై బీఆర్ఎస్ సభకు హాజరు కాకపోవడం సరైనది కాదు.. ఈ అంశంపై ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలి.’

అని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కీలకమైన అంశంలో బాయ్ కాట్ నిర్ణయంపై సభలో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, కృష్ణా పరీవాహక ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీరుపై ఎదురు దాడి చేశారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తే తమ హయాంలో ఏం చేశామో ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండేదని, అలా కాకుండా సభకు రాకుండా పోవడం ఆ పార్టీ సెల్ఫ్​గోల్ చేసుకున్నట్లేనని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కు బూస్ట్!

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయమై సభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ప్రభుత్వం, కాంగ్రెస్ తరఫున నేతలు తమ వాయిస్ ను గట్టిగా వినిపించారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును తమ హయాంలోనే పూర్తి చేస్తామని చేసిన ప్రకటనలు ఆ పార్టీకి పెద్ద బూస్ట్ ఇచ్చినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజల్లోకి వెళ్లిందని, ప్రధానంగా కృష్ణా నది పరీవాహక ప్రాంత నియోజకవర్గాల్లో తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow