మరోవైపు  రోడ్డు ప్రమాదాల్లో  కూడా చాలా మంది చనిపోతున్నారు.. ప్రమాదాల్లో చనిపోయేవారికి ప్రాణాలు కావా అని ప్రశ్నించారు రేణుదేశాయ్.  దేశంలో ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు, దోమ కాటుతో, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానవత్వం వీడి కుటుంబ సభ్యులనే హతమరుస్తున్న  సంఘటనల్లో  లక్షలాది ప్రాణాలు పోతున్నారు.  వాటన్నిటినీ వదిలిపెట్టి  కేవలం కుక్కల వల్ల చనిపోయిన ప్రాణాలను మాత్రమే ప్రాణాలుగా  పరిగణిస్తే  ఎలా అని నిలదీశారు.

దేశంలో చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే కుక్కలు పిల్లలకు జన్మనిస్తూ వాటి సంఖ్య పెరుగుతోందన్నారు రేణుదేశాయ్. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా లేకపోవడంతో ఎదురయ్యే సమస్యను కుక్కలను చంపడం ద్వారా పరిష్కరిస్తాం అనుకుంటే పొరపాటు అని హెచ్చరించారు. ప్రభుత్వాలు అయినా, వ్యక్తులైన కుక్కలు క్రూరంగా హత్య చేసే కార్యక్రమాలకు తక్షణమే  ముగింపు పలకాలని డిమాండ్ చేశారు రేణుదేశాయ్. మరిన్ని వార్తలు