బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, వెంకటాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వైపు వెళ్తున్న నాగర్ కర్నూల్ డిపోకు చెందిన బస్సు నెంబర్ TS31T7029 నెంబర్ గల బస్సు ఓవర్ స్పీడ్ తో రావడంతోనే గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండడంతో బస్సు అతి వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. మృతుడు ఏ గ్రామానికి చెందిన వారు అని పోలీసులు విచారిస్తున్నారు.
Tags
Mahabunagar