KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్


 మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. హైదరాబాద్, నంది నగర్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

KCR : రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. అంతలోనే వారిపై క్రిమినల్ కేసు!

గత బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. మొన్నటివరకు దీని గురించి చర్చ పెద్దగా లేకపోయింది. ఉన్నట్టుండి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిపేర్ అంశాన్ని రాష్ట్ర సర్కార్ తెరమీదకు తెచ్చింది. అయితే, దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ఇది కక్షపూరిత రాజకీయాలకు నిదర్శమని విమర్శిస్తున్నారు. రేపు (ఆదివారం) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రానున్నారు.ఆయన రాక కోసం గులాబీ లీడర్లు, కేడర్ ఎంతగానో ఎదురుచూస్తున్నది. కేసీఆర్ బయటకు వస్తున్నారంటే కేడర్‌లో ఎంతో ఉత్సాహం నెలకొంటుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. గులాబీ బాస్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటం, పార్టీకి వరుస ఓటముల కారణంగా కిందిస్థాయి నేతలు నిరాశలో ఉన్నట్లు తెలుస్తున్నది.

కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతినాలనా?

బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి రెండేండ్లు పూర్తయింది. అప్పటి నుంచి కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. సభలు, సమావేశాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు.అది కూడా ప్రెస్‌మీట్స్ పెట్టడం లేదు. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ రావులే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేటుచేసుకున్న కొన్నిపరిణామాలు, సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమిపై కేసీఆర్ రివ్వ్యూ చేసినట్లు తెలుస్తున్నది. ఆశించిన దాని కంటే కాస్త ఫలితాలు రివర్స్ అయినా.. గ్రామాల్లో ఇంకా గులాబీ పార్టీకి పట్టు తగ్గలేదని ఆయన ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే పార్టీ లీడర్లు, శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు రేపు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు.

ఏపీ జలదోపిడీ.. సర్కారుపై విమర్శల బాణం

పీ ప్రభుత్వం కృష్ణా జలాలు దోపిడీ చేస్తున్నా రేవంత్ సర్కార్ మిన్నకుండిపోయిందని, పట్టించుకోవడం లేదని కేసీఆర్ ఇటీవల ఫైర్ అయ్యారు. దాని మీద రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణభవన్ వేదికగా వివరించనున్నారు. కాంగ్రెస్ సర్కారు మీద మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ముందుగా ఏపీ సర్కార్.. తెలంగాణకు దక్కాల్సిన నీటి వనరులను ఎలా దోపిడీ చేస్తున్నదో ఆయన వివరించనున్నారు. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో ఎలా ముందకు వెళ్లాలనే అంశం మీద పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తున్నది.
ఇదే టైంలో కాళేశ్వరం అంశాన్ని ముందుకు తీసుకొచ్చి కేసుల పేరుతో ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.ఎందుకంటే కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయం తెలిసిందే. దీనికి మరమ్మతులు నిర్వహించాలని ఎల్ అండ్ టీ సంస్థను సర్కార్ ఆదేశించినా ఆ సంస్థ పట్టించుకోవడం లేదు. దీంతో ముందుగా ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంతకుముందు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ప్రాజెక్టు రీడిజైన్ పూర్తిగా కేసీఆర్ నిర్ణయం మేరకు జరిగిందని నిర్దారించి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. అయితే,ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా మరోసారి కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌ను ఇరికించి ఇబ్బంది పెట్టాలని సర్కార్ భావిస్తున్నదని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదని చట్టప్రకారమే అంతా జరుగుతుందని గులాబీ లీడర్ల ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow