కొల్లాపూర్/పెంట్ల వెల్లి : తెలంగాణలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 14న జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాక మంత్రి జూపల్లి కృష్ణారావుకు పరాభవం ఎదురైంది. పెంట్ల వెల్లి మండలం గోప్లాపూర్ ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగం గా శుక్రవారం గోప్లాపూర్ గ్రామానికి మంత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి వ్యతిరేకంగా గ్రామస్తులు గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. పూటకో మాట రోజుకో మాట పార్టీ మీ గ్రామ నాయకుల మాదిరి పనిచేయలేదు. నేను నీతి, నిజాయితీగా 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న. ఓ సందర్బంగా లో తప్ప.. ఏ పార్టీ మారలేదని అంటూ మాట్లాడుతుండగా గ్రామస్తులు జోక్యం చేసుకొని పూటకో పార్టీ మారిన ఘన చరిత్ర నీది. మా నాయకులది కాదు. కాంగ్రెస్ పార్టీలో సర్పంచి అభ్యర్థి లేకపోవడంతో సిగ్గు లేక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీ బందు తీసుకున్న మహిళను కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో మీ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేయడానికి వచ్చావని మంత్రి జూపల్లి పై గ్రామస్తులు మండిపడ్డారు. గత రెండు దశాబ్దాలుగా కొల్లాపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా మంత్రి పదవులు అనుభవిస్తూ తాలూకాలో అభివృద్ధి శూన్యం. ఏమి అభివృద్ధి పనులు వర్గబెట్టవని, ప్రచారం చేయడానికి వచ్చావంటూ గ్రామస్తులు నిలదీయడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి జూపల్లి డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జూపల్లి వెను తిరిగి వెళ్లిపోయారు.
Tags
mahabubnagar