జడ్చర్లలో గుప్తనిధుల కలకలం

 


మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కావేరమ్మపేటలో ఒక పాత ఇంట్లో భూమి తొవ్విన శబ్దం వస్తుందని   డైల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదు అందుకున్న జడ్చర్ల పోలీసులు వెంటనే  కావేరమ్మపేటలో ఉన్న ఇంటికి చేరుకొని ఇల్లు చూడగా ఇంటి పైన టెంట్లు వేసి లోపల గడ్డపారలు, పారలతో పెద్ద పెద్ద గుంతలు తొవ్వారు. 

గుప్తనిధుల కోసమే గుంతలు   ఇంకేమైనా మర్మం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపైన లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు. 

ఎందుకు గుంతలు తోవుతున్నారు ఎన్ని రోజుల నుంచి తొవ్వుతున్నారని పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. 

జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. 

ఈ తవ్వకాల కలకలం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ బుక్క మహేష్ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ చౌహన్ జడ్చర్ల పట్టణానికి చెందిన ప్రముఖులు అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకునే పనిచస్తున్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow