తప్పిన పెను ప్రమాదం..బొలెరోను ఢీకొని బస్సు బోల్తా

బొలెరోను ఢీకొని బస్సు బోల్తా



వెనక నుంచి ఢీకొన్న మూడుకార్లు

విద్యార్థులతో పాటు వాహనదారులకు గాయాలు

సహాయక చర్యలు చేపట్టిన మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరు జిల్లా బాలానగర్ లో ఘట

, జడ్చర్ల:

విహారయాత్రకు 43 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురవడం తో పలువురు గాయపడ్డారు. బస్సు బొలెరో వాహనాన్ని ఢీకొని బోల్తా పడగా వెనకాలే వస్తున్న మూడుకార్లు కూడా బస్సును ఢీకో న్నాయి. ఈ ఘటన ఇవాళ పాలమూరు జిల్లా బాలానగర్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రిషి హైస్కూల్ బస్సును అద్దెకు తీసుకొని మణి కంఠ జూనియర్ కళాశాల చెందిన 43 మంది విద్యార్థులు హైదరాబాద్ లోని జలవి హార్ కు విహార యాత్రకు బయలుదేరారు. బాలానగర్ మండల సమీపంలో బొలెరో


వాహనాన్ని బస్సు ఢీకొని బోల్తా పడింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న మరో మూడు కార్లు బస్సును ఢీకొన్నాయి ఈ ప్ర మాదంలో బస్సులోని విద్యార్థులతో పాటు. పలు వాహనాల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ఘట న స్థలం వద్ద ఆగి ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను, ప్రయాణికులను ఆసుపత్రికి తరలించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను స్థానికులు రక్షించి షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదానికి సంబంధిం చిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


షాద్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేందిర బోయి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన 6 మంది విద్యార్థులను షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ స్థానిక బుగ్గారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విహారయాత్ర కోసం మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు 54 మంది విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ కళాశాల బస్సు బోల్తా పడిందని తెలిపారు. ప్రమాదంలో 6 మంది విద్యార్థులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స నిర్వహించి వారి ఇళ్లకు పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ విజేందిర బోయి తెలిపారు. 


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow