40 తులాల బంగారం, నగదు మాయం.. ఆలస్యంగా వెలుగులోకి!?


 కల్వకుర్తి : కల్వకుర్తిలో 40 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీ అయినా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో వెంకటేశ్వర శర్మ ఇంట్లో 40 తులాల బంగారం, 6 లక్షల నగదును దుండగులు దొంగిలించారు. శర్మ వారం క్రితం వృత్తి రీత్యా ఊరికి వెళ్ళాడు. అదే అదనుగా చూసిన దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

సోమవారం తన స్వగృహానికి చేరిన శర్మ ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువా లాకర్ తెరిచి ఉన్నాయి. వస్తువులు చిందర వందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటన స్థలాన్ని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవ రెడ్డి తెలిపారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow