Shree Hanuman Chalisa: రికార్డ్.. ఈ గీతానికి 500 కోట్ల వ్యూస్‌..


 శ్రీ హనుమాన్ చాలీసా’ (Shree Hanuman Chalisa) రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో దానికి 500 కోట్ల వీక్షణలు వచ్చాయి.    ఈ స్థాయి వ్యూస్‌ అందుకున్న తొలి భారతీయ వీడియో ఇదే కావడం విశేషం.

ప్రముఖ మ్యూజిక్ రికార్డు లేబుల్ టి-సిరీస్‌ యూట్యూబ్‌లోని తన భక్తి ఛానల్‌లో 2011, మే 10న ‘శ్రీ హనుమాన్ చాలీసా’ గీతాన్ని అప్‌లోడ్ చేసింది. దానిని ప్రముఖ సింగర్ హరిహరన్ ఆలపించగా, లలిత్‌సేన్ సంగీతం అందించారు. టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ (Gulshan Kumar) అందులో నటించారు. గత 14 ఏళ్లుగా ఒక భక్తిగీతంగా అందరి ఇళ్లల్లో వినిపిస్తోంది. ఈ రికార్డ్‌పై గుల్షన్ కుమారుడు, టి-సిరీస్ ఎండీ భూషణ్‌ కుమార్ స్పందించారు. ‘‘నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసాకు ప్రత్యేక స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపేవారు. అది అందరికీ చేరువ కావాలని కోరుకునేవారు. ఆ దార్శనికతకు ఇది నిదర్శనం. 500 కోట్ల వీక్షణలు అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్ఫూర్తినిస్తుంది’’ అని భూషణ్ పేర్కొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow