KTR: ఈ-కార్‌ రేసింగ్‌.. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి


 హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి.

ఈక్రమంలో కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో పేర్కొంది. ఈక్రమంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జీషీట్‌ దాఖలు చేయనుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow