Bus Accident: మార్నింగ్ స్టార్ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్డవారి మిట్ట జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇది బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండటంతో ఆరుగురికి తీవ్ర గాయాల పాలయ్యారు. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సలు ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ అధిక వేగంతో వస్తూ ఒక లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ రోడ్డు వంపు వల్ల అదుపు తప్పాడు. దొడ్డవారి మిట్టకు సమీపంలో బస్సు రైలింగ్‌ను ఢీకొని బోల్తా పడి పక్కకు తిరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు భయంతో కేకలు పిడుపు, బస్సు లోపల మహిళలు, పిల్లలు ఉండటంతో గందరగోళం నెలకొంది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులు అంతా గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగానే వెంటనే వారు సంఘటన స్థాలానికి చేరుకుని గాయపడిన వారిని ఉన్నత ఆసుపత్రులకు తరలించారు. గాయాలు పాలైన ఆరుగురిలో ఇద్దరు మహిళలు, ఒక పిల్లాడు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరుగులేదు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.