కృష్ణ విగ్రహాన్ని.... తొలగించాల్సిందే*

 



💥 *హైకోర్టు ఆదేశాలతో కృష్ణ విగ్రహంపై... చర్యలు తీసుకుంటాం*

💥 *కృష్ణ విగ్రహానికి.... అనుమతులు లేవు*

💥 *నోటీసిచ్చినా.... అధ్యక్షుడు హాజరు కాలేదు* 

💥 *అతి త్వరలోనే....యాక్షన్ తీసుకుంటాం*

💥 *ఉంచాలా, తొలగించాలా అనేది.... ఉన్నతాధికారుల సూచనలు తీసుకుంటాం* 

💥 *మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి*

. హైకోర్టు ఆదేశాలతో కృష్ణ విగ్రహంపై చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ టి. ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కృష్ణ విగ్రహం కేసు విచారణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ హైకోర్టులో కేసు వేశారని ఆయన తెలిపారు. దీంతో తనను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 

👉 *కృష్ణ విగ్రహానికి.... అనుమతులు లేవు*


       ఇదిలా ఉంటే పట్టణంలోని డిఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి ఏమైనా అనుమతులు ఉన్నాయని మహబూబ్ నగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోష్నాను, ఇతర అధికారులను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అడగగా, విగ్రహానికి ఎలాంటి అనుమతులు లేవని అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోష్ణ తో పాటు ఇతర అధికారులు విలేకరుల సమక్షంలోనే కమిషనర్ కు సమాధానం ఇచ్చారు. 


👉 *నోటీసిచ్చినా.... అధ్యక్షుడు హాజరు కాలేదు* 


. ఈ నేపథ్యంలో కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు రమేష్ బాబుతో పాటు ఫిర్యాదుదారుడు 

దిడ్డి ప్రవీణ్ కుమార్ లకు ఇద్దరకి గురువారం హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఫిర్యాదారుడు హాజరుకాగా, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు హాజరు కాకపోవడంతో పాటు ఎందుకు రాలేదో అన్న సమాచారం సైతం ఇవ్వలేదన్నారు.  


👉 *అతి త్వరలోనే....యాక్షన్ తీసుకుంటాం*

         కృష్ణ విగ్రహానికి ఎలాంటి అనుమతులు లేవని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వివరణ ఇచ్చిన నేపథ్యంలో కృష్ణ విగ్రహంపై అతి త్వరలోనే యాక్షన్ తీసుకుంటామని కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి విలేకరులకు తెలిపారు. 

👉 *ఉంచాలా, తొలగించాలా అనేది.... ఉన్నతాధికారుల సూచనలు తీసుకుంటాం* 

          హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కృష్ణ విగ్రహాన్ని ఉంచాలా, తొలగించాలా అన్న అంశంపై అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోష్ణతో పాటు ఇతర టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. 


👉 *కృష్ణ విగ్రహాన్ని.... తొలగించాల్సిందే*


           ఎలాంటి అనుమతులు లేకుండా మహబూబ్ నగర్ పట్టణంలోని డిఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ మరోసారి డిమాండ్. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని, లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ కింద మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తానని ప్రవీణ్ తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow