బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) ప్రచారాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. మంత్రులు, పార్టీ నాయకులు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోజుకో సర్వే వదులుతూ మనల్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా గందరగోళానికి గురి చేస్తుందని.. దీనిపై అంతా అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మనకు మిగిలింది మూడు రోజులే అని.. మంత్రులు(Ministers), నాయకులు జాగ్రత్తలు పాటించి గంటకోసారి కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఉప ఉన్నికలు హీట్ పెంచుతున్నాయి. గెలుపు కోసం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పడరాని పాట్లు పడుతున్నాయి. మూడు పార్టీలు సర్వ శక్తులను ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. పోలింగ్‌కు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని బీఆర్ఎస్, ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీని దెబ్బకొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరుగుతున్న బై పోల్‌లో గెలిచి సత్తా చాటాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలా మూడు పార్టీల నేతలు ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది.
Tags
Telangana