ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని పాత ఎల్లాపూర్ లో 2017 సంవత్సరం లో లైంగిక దాడికి పాలుపాడిన ఇద్దరు నిందితులకు బుధవారం నిర్మల్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించినట్లు ఖానాపూర్ రాహుల్ గైక్వాడ్ తెలిపారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన స్నేహితుని భార్యను అపహరించి లైంగిక దాడి చేసిన ఇద్దరు నేరస్తులకి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ & సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్. శ్రీవాణి న్యాయస్థానంలో తీర్పు ఇచ్చారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని కుంచెపు గంగాధర్ తమ మిత్రుని భార్య పై లైంగిక దాడికి పాల్పడడంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిందితులైన ఇద్దరికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, ఒక్కొక్కరికి రూ.5,000/- చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ డా: జి.జానకి షర్మిల మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ కూడా శిక్ష నుండి తప్పించుకొలేరని పేర్కొన్నారు. నిర్మల్ పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ.. న్యాయ నిరూపణ జరిపి ఖచ్చితంగా శిక్ష లు పడేలా చేస్తారని సూచించారు. పోలీసు శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడటానికి తగిన సాక్షులను న్యాయస్థానాలలో ప్రవేశపెట్టటానికి నిర్మల్ పోలీసులు కృషి చేస్తున్నారు. నిందితుడి శిక్ష పడడంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వినోద్ రావు మరియు విచారణ అధికారులు ఏ.అశోక్ , డ్యూటీ ఆఫీసర్స్ అయిన ఏఎస్ఐ డల్లు సింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ , కానిస్టేబుల్ రాజ శేఖర్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Tags
Telangana