కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ.గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS

 


నాగర్ కర్నూల్ జిల్లా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పెద్దకొత్తపల్లి PS కి చెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుల్ మహేందర్ PC 2158 యొక్క కుటుంబానికి జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా"కోటి రూపాయలు" చెక్కును భార్య అంజలి కి అందజేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో SBI రీజినల్ మేనేజర్ సునీత గారు మాట్లాడుతూ మహేందర్ అకౌంట్ "పోలీసు శాలరీ ప్యాకేజీ"లో ఉన్నందున ఈ పాలసీ క్రింద కోటి రూపాయలను భార్య అంజలికి ఇవ్వడం జరిగింది. అలాగే 1000 ఇన్సూరెన్ క్రింద తల్లి నిరంజనమ్మ కి 20 లక్షల చెక్కును ఎస్పీ గారి చేతుల మీదుగా అందచేయడం జరిగిందనీ తెలిపారు. ప్రజలందరూ ఈ యొక్క పాలసీని ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు.
జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ను చేసుకొవలని జిల్లా ఎస్పీ గారు దిశ నిర్దేశాలు చేశారు.
ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటే మనకు ఏమైనా జరగరానిది జరిగితే మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఉంటుందని జిల్లా ఎస్పీ గారు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ. N. వెంకటేశ్వర్లు, CC బాలరాజు, పోలీస్ ఫ్యామిలీ కోఆర్డినేటర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ,బ్యాంకు సిబ్బంది మరియు మహేందర్ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. @TelanganaCOPs
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow