Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం


 హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. చాదర్‌ఘట్‌ పీఎస్‌ పరిధిలో సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్‌ఈస్ట్‌ డీసీపీ చైతన్యసై దాడి చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దొంగలు డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాళ్లను అడ్డుకునేందుకు వెళ్లిన డీసీపీ గన్‌మెన్‌ కిందపడిపోయారు. వెంటనే అతన్ని నుంచి గన్‌ తీసుకున్న డీసీపీ నిందితులు తప్పించుకోకుండా వాళ్లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.డీసీపీ కాల్పుల్లో ఆ దొంగలు గాయపడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

దరాబాద్‌ (Hyderabad) నగరంలో ఇవాళ(శనివారం) కాల్పులు (Gun Fire) కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగ (Cell Phone Thief)ను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య (DCP Chaitanya) ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు. ఈ నేపథ్యంలో దొంగపై స్వయంగా డీసీపీ చైతన్య కాల్పులు జరిపాడు. ఈ తోపులాటలో డీసీపీ చైతన్య తుపాకీ కిందపడింది.
తన గన్ కిందపడటంతో పక్కనే ఉన్న గన్‌మెన్ తుపాకీని తీసుకుని దొంగపై డీసీపీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సరూర్‌నగర్‌ విక్టోరియా గ్రౌండ్‌లో జరిగింది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow