అరుదైన మొక్కలు అందమైన పూలు*

 *


వీటికి నిలయంగా తెలంగాణ బొటానికల్ గార్డెన్


పాఠ్యాంశాలలో ఉన్న మొక్కలే ఎక్కువ

విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తున్న వైనం

స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన మొక్కలు అందమైన పూలను పుష్పించాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. సుకన్య తెలిపారు. 


దేశం లోని వివిధ ప్రాంతాల్లోని అడవుల నుండి సేకరించి నాటిన మొక్కలు కాలానుగుణంగా పూవులు పూస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆర్కిడ్ లు, తెల్ల కలువ, అరుదైన జాతులెన్నో ఉన్నాయని గార్డెన్ సమన్వయ కర్త డా. బి. సదాశివయ్య తెలిపారు. 



ఆర్కిడ్ జాతులైన హాబినేరియా ఫర్సిఫెర, హాబినేరియా డిజిటేట, జియోడోరం డెన్సిఫ్లోరం, జియోడోరమ్ లాక్సిఫ్లోరమ్, యూలోఫియా గ్రమీనియా, లూసియా జైలానిక, వాండ టెస్టేసియా లు వికసించాయి. వీటితో పాటు సుమారు 12 జాతుల ఇతర ఆర్కిడ్ మొక్కలున్నాయి. 


ఇవే కాకుండా *హెటెరోస్టెమ్మ బెడ్డోమి* అనే తీగ జాతి మొక్కను సుమారు 160 సంవత్సరాల తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో డా. సదాశివయ్య మరియు డా. ప్రసాద్ (శ్రీ వెంకటేశ్వర కళాశాల, న్యూ ఢిల్లీ) లు కనుగొన్నారు. అంతకు ముందు ఇది కేవలం కేరళ ప్రాంతంలో మాత్రమే 160 సంవత్సరాల క్రితం 1862లో గుర్తించబడింది. దీనికి సంబంధించిన హైర్బేరియం (మొక్క నమూనా) కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. దీనిని ఇప్పుడు కళాశాలలోని *తెలంగాణ స్టేట్ హెర్బేరియం* లో భద్రపరిచారు. ఈ మొక్క ఇప్పుడు బొటానికల్ గార్డెన్ లో వికసించింది. 


ఇలాంటి అరుదైన మొక్కలెన్నో ఈ గార్డెన్ లో ఉన్నాయని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. 


వీటన్నిటిని ప్రత్యేకమైన గ్రీన్ నెట్ హౌస్ లలో సంరక్షిస్తున్నామని వీటి నిర్మాణానికి పూర్వవిద్యార్థులు, దాతల సహకారం ఎంతో ఉందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇలాంటి అరుదైన మొక్కలన్నీ విద్యార్థులకు పాఠ్యాంశాలు గా ఉన్నాయని వీటిని విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకుంటున్నారు అని కళాశాల వృక్షశాస్త్రం విభాధిపతి డా. నర్మద పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow