అక్టోబర్ 22 నుంచి కార్తిక మాసం- ఏ రోజు ఏ పండుగ ఉందో తెలుసా?


 Festivals In Karthika Masam : దీపావళి పండుగ పూర్తి కాగానే కార్తిక మాసం ఆరంభమవుతుంది. కార్తిక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా శివుడికి ప్రీతికరమైన ఈ మాసంలో నదీ స్నానాలు, దీపారాధనలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది. ఈ మాసంలో చేసే దైవారాధనతో పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ మాసంలో ప్రదోషంలో చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఇంతటి పవిత్రమైన కార్తిక మాసంలో ఎలాంటి పండుగలు, పుణ్య తిధులు రానున్నాయో ఈ కథనంలో చూద్దాం.

కార్తిక మాసం ఎప్పుడు?
ఆశ్వయుజ అమావాస్య అక్టోబర్ 21 వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉంది కాబట్టి అక్టోబర్ 22 వ తేదీ బుధవారం నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతుంది. నవంబర్ 20 గురువారం వరకు కార్తిక మాసం కొనసాగుతుంది. కార్తిక మాసంలో విశేషమైన పండుగలు - పుణ్య తిథులు ఇవే.

  • అక్టోబర్ 21 వ తేదీ మంగళవారం: ఆశ్వయుజ అమావాస్య: కేదారగౌరి వ్రతం.
  • అక్టోబర్ 22 వ తేదీ బుధవారం కార్తిక శుద్ధ పాడ్యమి: కార్తిక మాసం ప్రారంభం, బలిపాడ్యమి, గోవర్ధనపూజ, ఆకాశదీపారంభం, కార్తిక స్నానారంభం.
  • అక్టోబర్ 23 వ తేదీ గురువారం కార్తిక శుద్ధ విదియ: చంద్రోదయం, యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం
  • అక్టోబర్ 25 వ తేదీ శనివారం కార్తిక శుద్ధ చవితి: నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెద్ద శేషవాహనం
  • అక్టోబర్ 26 వ తేదీ ఆదివారం కార్తిక శుద్ధ పంచమి: నాగ పంచమి
  • అక్టోబర్ 29 వ తేదీ బుధవారం కార్తిక శుద్ధ అష్టమి: తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ, బుధాష్టమి
  • అక్టోబర్ 30 వ తేదీ గురువారం కార్తిక శుద్ధ నవమి: కోటి సోమవారం, తిరుమల శ్రీవారి పుష్పయాగం
  • అక్టోబర్ 31 వ తేదీ శుక్రవారం కార్తిక శుద్ధ దశమి: యాజ్ఞవల్క్య మహర్షి జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి
  • నవంబర్ 1వ తేదీ శనివారం కార్తిక శుద్ధ ఏకాదశి: చిలుక ఏకాదశి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం ప్రారంభం
  • నవంబర్ 2 వ తేదీ ఆదివారం కార్తిక శుద్ధ ద్వాదశి: కైశిక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, తులసి కళ్యాణం, తిరుమల శ్రీవారి ఆస్థానం, చాతుర్మాస వ్రత సమాప్తం.
  • నవంబర్ 4 వ తేదీ మంగళవారం కార్తిక శుద్ధ చతుర్దశి: వైకుంఠ చతుర్దశి
  • నవంబర్ 5 వ తేదీ బుధవారం కార్తిక శుద్ధపౌర్ణమి: కార్తిక పౌర్ణమి, తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి సన్నిధిలో అన్నాభిషేకం, అరుణాచల గిరి ప్రదక్షిణం, ఆకాశదీపం, జ్వాలాతోరణం, సువర్ణముఖి తీర్ధ ముక్కోటి
  • నవంబర్ 6 వ తేదీ గురువారం కార్తిక బహుళ పాడ్యమి: విశాఖ కార్తె ప్రారంభం
  • నవంబర్ 8 వ తేదీ శనివారం కార్తిక బహుళ చవితి : సంకష్ట చతుర్థి
  • నవంబర్ 14 వ తేదీ శుక్రవారం కార్తిక బహుళ దశమి: బాలల దినోత్సవం, జవహర్ లాల్ నెహ్రూ జన్మ దినోత్సవం
  • నవంబర్ 15 వ తేదీ శనివారం కార్తిక బహుళ ఏకాదశి: ఉత్పత్తి ఏకాదశి, సర్వ ఏకాదశి.
  • నవంబర్ 16 వ తేదీ ఆదివారం కార్తిక బహుళ ద్వాదశి: వృశ్చిక సంక్రమణం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, శ్రీ వేదనారాయణ స్వామి పవిత్రోత్సవం
  • నవంబర్ 17 వ తేదీ సోమవారం కార్తిక బహుళ త్రయోదశి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
  • నవంబర్ 19 వ తేదీ బుధవారం కార్తిక బహుళ చతుర్దశి: మాసశివరాత్రి
  • నవంబర్ 20 వ తేదీ గురువారం కార్తిక బహుళ అమావాస్య: కార్తిక అమావాస్య
  • నవంబర్ 20 వ తేదీ అమావాస్యతో కార్తిక మాసం సమాప్తం అవుతుంది.

శివకేశవుల ఆరాధనకు శ్రేష్టమైన కార్తిక మాసంలో శాస్త్రంలో సూచించిన విధంగా పండుగలు జరుపుకుందాం. పుణ్య తిధులు పాటిద్దాం. సలక శుభాలు పొందుదాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow