Telangana School Holidays 2025: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్లకు వరుస సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు శనివారం (సెప్టెంబర్ 6) సెలవిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా..
ఇక ఈ రోజు (సెప్టెంబర్ 5) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 6న హైదరాబాద్ సహా.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు గణేష్ నిమజ్జనం కారణంగా మరొక సెలవు వచ్చింది. ఇక సెప్టెంబర్ 7న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి.
అయితే సెప్టెంబర్ 6న సెలవు కారణంగా అక్టోబర్ 11వ తేదీన వచ్చే రెండో శనివారం రోజున సెలవు రద్దు చేసి, పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పర్యాటక ప్రదేశాలకు వరుస కట్టారు. వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక దసరా కూడా సమీపిస్తుండటంతో మరో విద్యార్దుల భారీగా వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దాదాపు 13 రోజుల పాటు దసరా పండగ సెలవులు రానున్నాయి.