జడ్చర్ల, సెప్టెంబర్ 25 :
మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు గురువారం శ్రీ గౌరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర శతనామావళి, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమంలో భక్తులు గిరమోని రామకృష్ణ దేవమ్మ దంపతులు, పండ్ల దేవరాజు లక్ష్మమ్మ దంపతులు, శృతి, స్రవంతి, దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, విజయ్ కుమార్ గౌతమీ ప్రియాంక దంపతులు, గుండు చంద్రశేఖర్, యాదగిరి, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Jadcherla
