అరవిందో ఫార్మా కంపెనీ పొల్యూషన్ పై కదిలిన యంత్రాంగం

 


** ఫార్మా కంపెనీ నుండి వ్యర్థ జలాలను విడుదల చేయడంతో చెరువులు, కుంటలు వ్యవసాయ పంట పొలాలు కాలుష్యంగా మారాయని దీంతో ఫార్మా కంపెనీ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకపోతే తానే కంపెనీని తగలబెడతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరిస్తూ వీడియో విడుదల చేయడంతో ఎట్టకేలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించారు.

* మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి పారిశ్రామికవాడలో అరబిందో ఫార్మా కంపెనీ నుండి వ్యర్థ జలాలను విడుదల చేయడంతో అవి సమీప గ్రామాలైన రాయపల్లి, ముదిరెడ్డిపల్లి తదితర గ్రామాల కుంటలు ,చెరువులలో కలిసి కలుషితంగా మారడంతో బాధిత రైతులు గతంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వ్యర్థ జలాలను విడుదల చేస్తున్న ఫార్మ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గతంలో అసెంబ్లీలో ప్రస్తావించినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడమే గాక మరో మారు వర్షపు నీటితో కంపెనీ వ్యర్థ జలాలను పైప్ లైన్ ల ద్వారా విడుదల చేయడంతో తమ పంట పొలాలు పాడవుతున్నాయని మరో మారు బాధిత రైతులు ఎమ్మెల్యేకు తెలపడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే పరిశ్రమ వ్యర్థ జలాలను విడుదల చేయవద్దని ఇప్పటికే సమీప గ్రామాలు పూర్తిగా కలుషితంగా మారి వ్యవసాయ రంగం ప్రశ్నార్థకంగా మారిందని తాను రైతులకు అండగా ఉంటూ రైతుల పక్షాన పోరాడుతానని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు వెంటనే స్పందించి అరబిందో ఫార్మా కంపెనీ పై చర్యలు తీసుకోవాలని లేని ఎడల కంపెనీని తానే వచ్చి తగలబెడతానని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు నేడు అరబిందో ఫార్మా కంపెనీని సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన వ్యర్ధ జలాలకు సంబంధించిన సంపులను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. అనంతరం కంపెనీ బయట వ్యర్ధాలు విడుదలయ్యే ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసర్ నరేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము అరబిందో ఫార్మా కంపెనీని విజిట్ చేయడం జరిగిందని కంపెనీ నుండి విడుదల చేసే వ్యర్థ జలాల వల్ల సమీప గ్రామాలలో నీటి కుంటలు చెరువులు, భూగర్భ జలాలు కలుషితంగా మారాయని బాధిత రైతులు ఎమ్మెల్యేకు తెలపడంతో నేడు పరిశీలన చేపట్టడం జరిగిందని వాటికి సంబంధించి శాంపిల్స్ కూడా సేకరించామని ల్యాబ్ టెస్ట్ అనంతరం ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తధనంతరం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మరోవైపు గత కొన్నేళ్లుగా అరబిందో ఫార్మా కంపెనీ నుండి వర్షపు నీటితో పాటు వ్యర్ధ జలాలను కూడా పరిశ్రమ నుండి విడుదల చేయడంతో అవి తమ గ్రామాల పరిధిలో చెరువులు కుంటలలో కలిసి కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితంగా మారాయని దీంతో ఇటీవల కాలంలో బోర్లు వేసినా కూడా కలుషిత నీటితో పంట పండే పరిస్థితి లేదని అలాగే కలుషిత నీటి వల్ల చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని దీంతో తాము నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే అరబిందో ఫార్మా కంపెనీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

*బైట్స్*

1). నరేందర్ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీస

ర్)

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow