కూకట్‌పల్లి బాలిక హత్య కేసు - పోలీసుల అదుపులో పదో తరగతి బాలుడు ! కూకట్‌పల్లి బాలిక కేసు.. డాడీ డాడీ అని అరుస్తుండగానే..

కూకట్‌పల్లి బాలిక హత్య కేసు - పోలీసుల అదుపులో పదో తరగతి బాలుడు - KUKATPALLY GIRL MURDER CASE UPDATE

కూకట్‌పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు - పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు సమాచారం- బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Kukatpally Girl Murder Case Update : కూకట్​పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరు లేరని గుర్తించి చోరీకి వెళ్లగా బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్‌పై రాసుకున్నాడు. ఆ పేపర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న బాలుడిని విచారిస్తున్నట్లు సమాచారం.

హంతకుడు దొరికేంతవరకు పోరాటం చేస్తాం : మరోవైపు ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని బాలిక తల్లిదండ్రులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు సహకరిస్తూనే పదేపదే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించారు. తమ కుమార్తెను హత్య చేయాల్సినంత అవసరం ఎవరికుందని, తమకు ఎవరితోనూ గొడవలు లేవని, అనుమానాలు లేవని తెలిపారు. బయటనుంచి ఎవరూ రాలేదని చెబుతున్నారని, మరి ఇంట్లో ఉన్న వారిపైనే అనుమానం పెడుతున్నారా? అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పోస్టుమార్టం రిపోర్టుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు దొరికేంతవరకు పోరాటం చేస్తామని, తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని బాలికి తండ్రి అన్నారు. న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగుతామని తల్లిదండ్రులు హెచ్చరించారు.

అసలేం జరిగింది : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన దంపతులు ఐదేళ్లుగా కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. తండ్రి స్థానికంగా మెకానిక్‌ షెడ్డులో పని చేస్తుండగా, తల్లి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌. వీరికి కుమార్తె , కుమారుడు ఉన్నారు. బాలిక ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలోని బడికి వెళ్తున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా, వారి కుమారుడు స్కూల్​కు వెళ్లాడు. క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.

కేకలు వేయడంతో : తమ్ముడి స్కూల్​కు వెళ్లి తానే లంచ్​ బాక్సు ఇస్తానని బాలిక చెప్పింది. దీంతో తల్లి భోజనం సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 'లంచ్‌ బాక్సు తీసుకురాలేదేమంటూ' స్కూల్‌ సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందిచారు.

పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం : బాలిక శరీరంపై 20వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 పోట్లు ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్​ ప్రకారం హత్య సోమవారం ఉదయం 9.30-10.30 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించారు. గత ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


దొంగతనం కోసం ఓ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఓ పేపర్‌లో దొంగతనం ఎలా చేయాలి? ఎలా బయటపడాలి? అని వివరంగా రాసుకున్నాడు. ఈ దొంగతనం ప్లాన్‌కు ‘మిషన్ డాన్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. చోరీ సమయంలో బాలిక అతడ్ని చూడటంతో దారుణానికి ఒడిగట్టాడు. అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేశాడు. బాలిక బతికితే.. దొంగతనం గురించి బయటకు చెబుతుందేమోనన్న భయంతో 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు.

 డాడీ, డాడీ అని అరుస్తుండగానే..

నిందితుడు బాలికను కత్తితో పొడుస్తున్న సమయంలో ‘డాడీ, డాడీ’ అంటూ గట్టిగా అరిచింది. అరుపులు బయటకు వినపడకుండా ఉండాలని గొంతులో కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. దాదాపు పదికిపైగా సార్లు గొంతుపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. కత్తి దాడిలో బాలిక చనిపోయింది. నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. విధులకు వెళ్లిన బాలిక తండ్రి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచి చూసి షాక్ అయ్యాడు. రక్తపు మడుగులో కన్న బిడ్డ పడి ఉండటం చూసి గట్టిగా గుండెలు అవిసేలా ఏడవటం మొదలెట్టాడు. అతడి అరుపులు, ఏడుపులు విని స్థానికులు అక్కడికి వచ్చారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. దాదాపు 5 రోజుల తర్వాత నిందితుడు దొరికాడు.

కూకట్‌పల్లిలో 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు బాలిక మర్డర్ కేసును ఛేదించారు. బాలికను 10వ తరగతి చదువుతున్న అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బాలిక ఇంటి పక్కన ఉండే బిల్డింగ్‌లో నిందితుడు ఉంటున్నాడు. దొంగతనం కోసం బాలిక ఇంటికి వెళ్లాడు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow