వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీసుల భద్రతా చర్యలు – ప్రత్యేక తనిఖీలు

 


జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది.


ఈ క్రమంలో ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రదేశాలైన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, క్లాక్ టవర్ కూడలి, మెట్టుగడ్డ కూడలి మరియు ఇతర రద్దీ ప్రాంతాలలో బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ (BDS) మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో సమగ్ర తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలలో పబ్లిక్ ప్లేసులు, వాహనాలు, లగేజ్‌లు మరియు అనుమానాస్పద వస్తువులను పరిశీలించడం జరిగింది.


ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ – “వినాయక చవితి సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటం మా ప్రాధాన్యత. ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తోంది. రద్దీ ప్రదేశాలు, పండుగ ప్రాంగణాలు, ముఖ్య కూడళ్లు వంటి ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, మొబైల్ పట్రోలింగ్, సీసీ కెమెరా మానిటరింగ్ వంటి చర్యలు కూడా చేపట్టబడ్డాయి.


ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


పండుగను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి జిల్లా పోలీసులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని ఎస్పీ తెలి

పారు.”

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow