ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నస్టిక్ సెంటర్..!*

 *ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయాగ్నస్టిక్ సెంటర్..!*



*-జడ్చర్లలో తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్న అన్నపూర్ణ జయ డయాగ్నొస్టిక్ సెంటర్ సెంటర్*

*-విచారణ చేపట్టిన డిప్యూటీ డిఎంహెచ్వో* 

*-ఆసుపత్రికి, డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ*


, జడ్చర్ల :

సమాజంలో అంతా ఆరోగ్యంగా ఉండాలని ఏవరికి ఏ ఆరు ఆరోగ్యం రాకూడదని అంతా భావిస్తారు కానీ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో లేని జబ్బులు ఉన్నట్లు రిపోర్టులు ఇవ్వడంతో ప్రజలు పడలెత్తిపోతున్నారు. ఇలాంటి ఘటననే సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ యూరాలజీ జయ డయాగ్నస్టిక్ సెంటర్లో వెలుగు చూసింది మిడ్జిల్ మండలానికి చెందిన ఓ బాధితుడు రెండు రోజుల క్రితం ఎస్ జి పి పరీక్ష చేపించుకోగా 4,9 ఫలితం వస్తే 1649 ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు షుగర్ నిర్ధారణ కొరకు రక్త పరీక్ష చేయించుకోగా 210 ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు దీంతో అనుమానం వచ్చిన బాధితుడు మరోచోట పరీక్షలు చేయించుకోగా షుగర్ 120 ఉన్నట్లు నిర్ధారణ అయింది దీంతో బాధితుడు అన్నపూర్ణ ఆసుపత్రి లో నిర్వహిస్తున్న జయ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద చేరుకొని ఇదేంటని నిలదీయగా తమ డయాగ్నెట్ సెంటర్లోని ఆపరేటర్ల ద్వారా తప్పు జరిగిందని ఎస్ జి పి పరీక్షలో 49 బదులు 1649

అని పొరపాటున ఏసారని షుగర్ పరీక్షలో కూడా పొరపాటు జరిగిందని ఆసుపత్రి యజమాన్యం బాధితులకు క్షమాపణలు చెప్పింది. ఇదే డయాగ్నస్టిక్ సెంటర్లో గతంలో కూడా పలువురికి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని దీనితో బాధితులు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురయ్యారని పలువురు ఆరోపించారు ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో మంజుల సోమవారం సాయంత్రం జయ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద చేరుకొని విచారణ చేపట్టగా తమ ఆత్పత్రి సిబ్బంది ద్వారానే తప్పు జరిగిందని ఆస్పత్రి వైద్యుడు అరుణ్ కుమార్ తెలిపారు. ఆస్పత్రి నిర్వహణ డయాగ్నస్టిక్ తప్పుడు నివేదికలపై డిప్యూటీ డిఎంహెచ్ మంజుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తప్పుడు రిపోర్ట్ చూసిన బాధితులు ఆందోళన చెంది వారి ప్రాణాలకు ఏమైనా ముప్పు చదివి ఉంటే ఎవరు బాధ్యులు అని ఆసుపత్రి నిర్వాహకులను నిలదీశారు ఇలాంటి ఘటనలు పునారవృతం కాకూడదని మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఆసుపత్రిని డయాగ్నస్టిక్ సెంటర్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు ఈ ఘటనపై ఆసుపత్రి నిర్వాహకులకు డాక్టర్ అరుణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు నిర్దేశిత గడువులోగా జిల్లా వైద్య అధికారులకు సమాధానం చెప్పాలని ఆమె నోటీసులో పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చే డయాగ్నస్టిక్ సెంటర్ లను తీజ్ చేస్తామని అని హెచ్చరించారు జడ్చర్ల పట్టణంలో తప్పుడు నివేదికలు ఇస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ల సంఖ్య అధికంగానే ఉందని వాటిపై కూడా జిల్లా వైద్యశాఖ నిగా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow