44వ జాతీయ రహదారి పక్కన డాక్ బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మకు ఆదివారం మహిళలు ఘనంగా బోనాలను నిర్వహించారు. బోనాల మహోత్సవంలో మహిళలలు అధిక సంఖ్యలో పాల్గొనీ అమ్మవారికి బోనాలను మొక్కులను తీర్చుకున్నారు. బోనాల మహోత్సవంలో మహిళలు, భక్తులు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు చైతన్య చౌహన్, బుక్క మహేష్, ప్రశాంత్ రెడ్డి, కుమ్మరి రాజు, జ్యోతి రెడ్డి, శశికిరణ్, చైతన్య గౌడ్, రమేష్, నాయకులు బుక్క వెంకటేశం, నర్సింలు, రమేష్, చంద్రమౌళి, కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.