హైదరాబాద్‌లో యాక్టివ్‌గా ఉన్న అత్యంత అధునాతన, ఇంటర్నేషనల్ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ధ్వంసం చేసింది. ఈ నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌లోని కోంపల్లికి చెందిన ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సూర్య అన్నమనేని కీలక పాత్ర పోషించాడు.
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ దందా బయటపడింది. హైదరాబాద్ (Hyderabad)లో యాక్టివ్‌గా ఉన్న అత్యంత అధునాతన, ఇంటర్నేషనల్ డ్రగ్స్ (Drugs) అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ధ్వంసం చేసింది. ఈ నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌లోని కోంపల్లికి చెందిన ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సూర్య అన్నమనేని కీలక పాత్ర పోషించాడు. నగరంలోని మల్నాడు కిచెన్ అనే రెస్టారెంట్‌కు సూర్య యజమాని (Cocaine In Sandals).
సూర్యను ఈగల్ టీమ్ అతడి రెస్టారెంట్ సమీపంలో పట్టుకుంది. అతడి టాటా స్కార్పియోను తనిఖీ చేయగా అందులో 10 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల గంజాయి, 1.6 గ్రాముల ఎక్స్టసీ మాత్రలు లభ్యమయ్యాయి. అలాగే ఆ కారులో ఓ కార్డ్‌బోర్డ్ బాక్స్ కూడా లభ్యమైంది. ఆ బాక్స్‌లో పింక్ కలర్ హై హీల్స్ చెప్పులు ఉన్నాయి. ఆ హై హీల్స్‌ను తెరిచి చూడగా లోపల కొకైన్ ప్యాకెట్లు దొరికాయి. సూర్య అరెస్ట్ హైదరాబాద్‌లోని సంపన్న వర్గాలకు చెందిన వారి డ్రగ్స్ వినియోగాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. బెంగళూరులోని ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేసిన సూర్య 2020లో హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.
ఢిల్లీ, బెంగళూరు, గోవాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్‌తో తనకు సంబంధాలున్నట్టు సూర్య అంగీకరించినట్టు తెలుస్తోంది. అతడికి హిమాయత్ నగర్, వరంగల్, ఖాజీగుడాలో కూడా నెట్‌వర్క్ ఉన్నట్టు సమాచారం. అలాగే హైదరాబాద్‌లోని పలు హై స్కేల్ పబ్స్‌లో కూడా తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఈగల్ టీమ్ ఎదుట సూర్య అంగీకరించినట్టు తెలుస్తోంది. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఈగల్ టీమ్ ప్రయత్నిస్తోంది.