నోరూరించే భక్షాలు-మురుకులు, కారమవ్పలు, లడ్డూలు, చికెన్ పచ్చడి వింటుంటేనే నోరూరుతుంది కదా... ఇవన్ని ఎక్కడనుకుంటున్నారా.. అయితే చూద్దాం పదండి 100రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం కావేరమ్మపేట మున్సిపాలిటి ఫంక్షన్హాల్లో మెప్మా మహిళలంతా ఫుడ్ ఫెస్టివల్ అంటూ గివన్ని ప్రదర్శన, అమ్మకాలు పెట్టిండ్రు.గా దాంట్లోనే అమ్మలక్కలు ఇంటికాడ చేసుకువచ్చిన అరిసెలు, రక రకాల బొబ్బట్లు, ఎన్నెన్నో లడ్లు ఉన్నయ్. టమాట, మామిడి, దోసకాయ, అవకాయ పచ్చళ్లని అనేకం ఉంచిండ్రు. జొన్న రొట్టెలు, చికెన్ బిర్యాని, చికెన్ పచ్చడి ఇంక చెప్పక్కరలేదనుకుంట. మనం రోజు తినే అన్ని రకాలవి పెట్టిండ్రుల్ల. గీ ప్రదర్శన ఎందుకంటే ఇళ్లల్లో వంటలు చేసే మన అక్కచెల్లళ్లను ప్రోత్సహించనిక్కెనంట. తిండి ఒకటే కాదు ప్లాస్టిక్ వాడకుండ బట్టబ్యాగులు, జ్యూట్ బ్యాగులు పెట్టిండ్రు. గివన్ని మీరు చూసెయ్యండి. |చూసాక ఒక లైక్, షేర్ మర్చిపోవద్దులల్ల