*
జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నేతాజీ చౌరస్తాలో గల అల్ఫా హోటల్ లో పరిశుభ్రత పాటించినందుకు నిర్వాహకుడు గోరేటి సూరికి జడ్చర్ల మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్ 5000 రూపాయలు జరిమానా విధించారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో టీ కొట్టు వ్యాపారం నిర్వహిస్తున్న సూరి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రత లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారుచేసి జనాలకు విక్రయిస్తుండడంతో మున్సిపల్ అధికారులు తనిఖీ నిర్వహించి జరిమానా విధించి, మొదటి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో ఆహార పదార్థాలు తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్ యజమాన్యాలు, రాబోయే వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను రోగాల పార్టీ కాపాడాలని పత్రికాముఖంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ కృష్ణారెడ్డి, సానిటరి జవాన్ ప్రకాష్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.