బుధ మహాదశ వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా , వ్యాపార పరంగా కలిసి వస్తుందని చెబుతారు పండితులు. ఇక జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం మహాదశ అనేది 17 సంవత్సరాలు. అయితే ఈ మహాదశ ప్రభావం అనేది ఏ రాశులపై శుభప్రదంగా ఉంటుందో, వారికి అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం
వృషభ రాశి : బుధ మహాదశ ప్రభావంతో వృషభ రాశి వారికి సంఘంలో గుర్తింపు వస్తుందంట. వీరి తెలివి తేటలకు ప్రతి ఒక్కరూ మగ్ధులైపోతారని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా చాలా కాలంగా ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నదంట. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుందంట.
తుల రాశి : తుల రాశి వారికి బుధ మహాదశ వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారం, మీడియా, వంటి రంగంలో ఉన్నారో, వారు పురోగతి సాధిస్తారంట. కొంత మంది ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉన్నదంట.
మిథున రాశి : మిథు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. అంతే కాకుండా ఈ రాశి వారికి విద్య, వైద్య వృత్తిలో గొప్ప విజయాలు, వ్యాపారంలో అనేక లాభాలు అందుకుంటారు. అంతే కాకుండా వీరు తీసుకునే నిర్ణయాలు బాగుండటంతో ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఆనదంగా గడుపుతారు.
కన్యా రాశి : కన్యా రాశి వారికి బుధ మహాదశ కాలంలో చాలా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ప్రధానంగా రాజకీయాలు, న్యాయవ్యవస్థ, మీడియా,ప్రజా సంబంధాల రంగాలలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
అంతే కాకుండ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇక వ్యాపారులు అనేక లాభాలు అందుకుంటారు. బుధ మహాదశ వలన ఈ రాశి వారికి వ్యాపారంలో అపారమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Tags
india