Heavy Rain In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గత కొద్దిరోజుల నుంచి వాతావరణం చల్ల బడింది. కొంత సేపు ఎండలు కొట్టినా.. మిగితా సమయం మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది
రేపు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.