రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఆ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ

 




హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో శుభవార్త తెలిపింది. ఆరోగ్యశాఖలో (Health Department) మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ప్రభుత్వ ప్రకటనతో అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.


ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 3212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్‌, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1950 మల్టీ పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలను విడుదల చేయడంతో మెరిట్ జాబితాలు సిద్ధమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ఈరోజు(గురువారం) సాయంత్రం లేదా రేపు(శుక్రవారం) ఉదయం మూడు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال