భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..!


 

Pahalgam Terrorist Attack: ఏం జరుగుతుందో ఏమో.. భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం..

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయం మొదలైందా?.. భారత్‌ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా?.. అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో పొరుగు దేశాలతో పాక్‌ కాళ్ల బేరానికి దిగుతోందా?.. జోక్యం చేసుకోవాలని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. రష్యా, చైనాను కోరడమే అందుకు నిదర్శనమా?.. రోజుకో ఆలోచనతో అభాసుపాలవుతున్న పాకిస్తాన్‌ అసలు ఆలోచన ఏంటి?... భారత్‌ వైఖరితో తర్జనభర్జన అవుతున్న పాకిస్తాన్.. ఉగ్రదాడిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ సంచలన కామెంట్స్‌ చేస్తోంది. తమ పాత్రేమీ లేదంటూ ఒకరోజు.. యుద్ధానికి సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా.. పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. తాజాగా.. పహల్గామ్‌ ఉగ్రదాడి వ్యవహారంలో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని కోరారు. భారత్‌ అబద్ధం చెబుతోందా?.. తాము వాస్తవాలు మాట్లాడుతున్నామా?.. అనే అంశాలను వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయొచ్చని ఖవాజా ఆసిఫ్ విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- పాకిస్థాన్‌ సంయమనం పాటించాలని.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా కృషి చేస్తుందని వెల్లడించింది. అదేసమయంలో.. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసింది. ఇప్పటికే.. పహల్గామ్ ఉగ్రదాడిని అమానవీయ చర్యగాపేర్కొంది డ్రాగన్‌.

ఇక.. భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం చెలరేగకూడదని తాను కోరుకుంటున్నా అంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. వార్‌ జరిగితే శాంతికి భంగం కలుగుతుందన్నారు. లష్కరే తోయిబాకు చెందిన చాలామంది సభ్యులు ప్రస్తుతం జైళ్లలో, గృహ నిర్బంధాల్లో ఉన్నారని చెప్పారు. ఎల్‌ఈటీ అనుబంధ సంస్థ అయిన టీఆర్‌ఎఫ్ పహల్గామ్‌ దాడికి బాధ్యత వహించిందని.. ఆ తర్వాత మాత్రం యూ-టర్న్ తీసుకుందన్నారు. అయితే.. పాక్‌ డిఫెన్స్‌ మినిష్టర్‌ ఆసిఫ్‌.. ఒకవైపు.. శాంతి, దర్యాప్తు మంత్రాలు జపిస్తూనే.. మరోవైపు రష్యా, చైనా జోక్యం కోరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి.. ఇప్పటికే అమెరికా జోక్యానికి ప్రయత్నించి పాకిస్తాన్‌ విఫలమైంది. రెండు రోజుల క్రితం అమెరికా జోక్యానికి ప్రయత్నించిన పాక్‌ మీడియాకు అగ్రరాజ్యం దిమ్మతిరిగే షాకిచ్చింది. కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోబోమని అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేసినట్లు హౌట్‌ హౌస్‌ ప్రతినిధి వెల్లడించారు.

మొత్తంగా.. పహల్గామ్‌ ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌ పడరాని పాట్లు పడుతోంది. భారత్‌ కఠిన చర్యలతో వణికిపోతూ.. ఎప్పుడు ఎలాంటి సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తుందో అన్న భయంతో పాక్‌లో ఫియర్‌ నెలకొంది. ఈ క్రమంలోనే.. అమెరికా జోక్యానికి ప్రయత్నించగా ఆ దేశం తిరస్కరించడంతో.. తమ గోడు పట్టించుకోవాలంటూ ఇప్పుడు రష్యా, చైనాను దాయాది దేశం ప్రాధేయపడుతోంది.

Previous Post Next Post

Education

  1. TG DOST తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...! - New!

News

  1. TG SSC Results 2025 : నేడు తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి - New!

نموذج الاتصال