తెలంగాణ నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలపై టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ వెల్లడించింది పెండింగ్లో ఉన్న పలితా పరీక్షా ఫలితాల సంబంధించిన షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3పోస్టులతో పాటు మరికొన్ని నియామక పరీక్షల ఫలితాలకు ఈ నెలలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.మార్చి 10న గ్రూప్ 1 పరీక్ష కి సంబంధించి అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కులను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈనెల 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేస్తారు. ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష తుది ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు జనరల్ ర్యాంకింగ్స్ టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయిన 31 వేల మందిలో 21 వేల మంది మెయిన్స్ పరీక్షలు రాశారు. వీరంతా ఉత్కంఠగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. 783 పోస్టుల భర్తీకీ గత నవంబర్ లో గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహించగా.. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 1363 పోస్టుల భర్తీ కోసం నవంబర్ లో నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షకు 2 లక్షల 69 వేల మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు పరీక్షలు రాసిన ఆశావహులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ TGPSC పరీక్షా ఫలితాల విడుదల కు షెడ్యుల్ రిలీజ్ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఉద్యోగ నియామకాలకు సంబంధించి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎవరైనా గ్రూపు పరీక్షలకు సంబంధించి ఉద్యోగాల విషయంలో ఇప్పిస్తామని సంప్రదిస్తే వెంటనే టీజీపీఎస్ కి కంప్లైంట్ చేయాలని పేర్కొంది.
Tags
Hyderabad