మహబూబ్‌నగర్ జిల్లా హోమ్ గార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఐదుగురు హోమ్ గార్డ్స్‌కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సహాయం మెడికల్ అవసరాలు మరియు దివంగత హోమ్ గార్డ్స్ కుటుంబాలకు అందించబడింది.
లబ్దిదారుల వివరాలు:
1️⃣ కవిత – దివంగత HG ఆర్. ప్రకాష్ (హెచ్.జి.105) కుటుంబానికి ₹15,000/-
2️⃣ కె. శేఖరయ్య (హెచ్.జి.693) – మెడికల్ సహాయం ₹10,000/-
3️⃣ కె. వెంకట్రాములు (హెచ్.జి.701) – మెడికల్ సహాయం ₹10,000/-
4️⃣ నాగమణి (డబ్ల్యూహెచ్.జి.297) – మెడికల్ సహాయం ₹10,000/-
5️⃣ శోభా (డబ్ల్యూహెచ్.జి.29) – మెడికల్ సహాయం ₹10,000/-
హోమ్ గార్డ్స్ సంక్షేమం కోసం విభాగం తరఫున అందిస్తున్న ఈ ఆర్థిక సాయం, వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడుతుంది. హోమ్ గార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.