*
*శాస్త్ర గ్లోబల్ స్కూల్ లో ఘటన*
*శాస్త్ర గ్లోబల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న నీరజ్ స్కూల్ భవనం నుండి అనుమానస్పదంగా పడి మృతి చెందాడు*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని శాస్త్ర గ్లోబల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నటువంటి కోరేమోని నీరజ్ అనుమానాస్పద స్థితిలో రెండవ అంతస్తు నుండి పడ్డాడు అంత ఎత్తునుండి పడటంతో తీవ్ర గాయాలు పాలైన బాలుడిని వారి తండ్రి కోరేమోని హరిభూషణ్ బిజెపి షాద్ నగర్ పట్టణ అధ్యక్షులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు
*నీరజ్ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి*
*పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవలి*
*విద్యార్థికి కుటుంబానికి న్యాయం చేయాలి*
*ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ జిల్లా కన్వీనర్ సూర్యప్రకాష్*
*నీరజ్ ఘటనపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకులను అక్రమ అరెస్టు*
షాద్ నగర్ పట్టణం లో నిన్న శాస్త్ర హై స్కూల్ లో జరిగిన నీరజ్ ఘటనపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ విద్యార్థి నాయకులపై పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇందులో భాగంగా ఏబీవీపీ శంషాబాద్ జిల్లా విభాగ్ కన్వీనర్ సూర్యప్రకాష్, జిల్లా కన్వీనర్ చందు,SFD రాష్ట్ర కో కన్వీనర్ ప్రదీప్,సిటీ జాయింట్సెక్రటరీ పవన్,నగర కార్యదర్శి నవీన్ నాయక్,చాకలి మహేష్,నవీన్,నగర SFD కన్వీనర్ మహేందర్,వంశీ,రాకేష్,పవన్,మహేష్,విజయ్,జశ్వంత్ తదితరులను అరెస్టు అయ్యారు.
ఈ సందర్బంగా
*సూర్యప్రకాష్ మాట్లాడుతూ*
ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థులపై యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
పాఠశాలలకు పోటా పోటీగా విద్యార్థులపై చదువుల కోసం పాఠశాల యమన్యులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
గతంలో మేధా పాఠశాలలో కూడా విద్యార్థికి కరెంట్ షాక్ తగిలితే,ఆ విద్యార్థికి న్యాయం చేయమని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపితే పోలీసు అరెస్ట్ తో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసారని అన్నారు.
విద్యార్థి నీరజ్ ఘటన పై సమగ్ర విచారణ జరిపి,విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసేవరకు,ఏబీవీపీ వెనకడుగు వేయదని అన్నారు.