ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి మార్చి మాసఫలాలు

 

March 2025 Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి మార్చి మాసఫలాలు




మాస ఫలాలు (మార్చి 1 నుంచి మార్చి 31, 2025 వరకు): మేష రాశి వారికి ఈ నెల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు. ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయంటే.. 

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శనులు ధన, లాభ స్థానాల్లో ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే, వ్యయ స్థానంలో శుక్ర, బుధ, రాహువులు చేరడం వల్ల విలాసాల మీదా, కుటుంబం మీదా, ఆర్థిక సమస్యల పరిష్కారం మీదా డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఆఫర్లు అందుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల, ఆ రాశిలోనే బుధ, రాహువులు కూడా ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడు తుంది. పెద్దల సహకారంతో ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల వల్ల చికాకులు తలెత్తుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, లాభదాయకంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు. ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. మార్చి నెలంతా విలాసవంతంగా, సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా దూసుకుపోతాయి. ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దశమంలో శుక్రుడి వల్ల జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఏ విషయంలోనైనా కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, లాభ స్థానంలో గురువు ఉన్నందువల్ల మార్చి నెలంతా ఏదో రూపంలో ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావ డంతో పాటు ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతి ష్ఠలు పెరుగుతాయి. సమాజంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. సహోద్యోగులతో విభేదాలు పరిష్కారమవుతాయి. అష్టమ శని కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దశమంలో గురువు ఉండడంతో పాటు, దశమాధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఉద్యో గంలో పదోన్నతులకు అవకాశం ఉంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు డిమాండ్ పెరుగు తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపో తాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. లాభ స్థానంలో కుజ సంచారం వల్ల ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవు తుంది. పితృవర్గం నుంచి సంపద లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెల కొంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు ఉచ్ఛ శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల మార్చి నెలలో ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగు తుంది. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ పరిష్కారమై అన్యోన్యత పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గి పోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. స్నేహి తుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. మార్చి నెలంతా హ్యాపీగా గడిచిపోవడానికి అవకాశం ఉంది. గురు, శుక్రుల మధ్య పరివర్తన చోటు చేసుకున్న కారణంగా ఈ రాశివారికి విపరీత రాజయోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాధారణంగా ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగడానికి అవకాశం ఉంది. ఈ రాశివారి సలహాలు, సూచనలతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశికి గురు, శుక్రుల మధ్య, అంటే పంచమ సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరిగినందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. ఇంటా బయటా శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. రాశ్య ధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రతి పనీ శ్రమతో గానీ పూర్తి కాదు. ఆదాయంలో ఎక్కువ భాగం ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యమైన అవసరాలు తీరడం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయ స్థానంలో శని, రవులు, చతుర్థంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల మార్చి నెలంతా సుఖ సంతోషాలతో, సంతృప్తికరంగా సాగిపోతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా స్థాయి, హోదా బాగా పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంలోశుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. అయితే, అనవసర ఖర్చులు పెరగడం, డబ్బు నష్ట పోవడం వంటివి తరచూ జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతాయి. కొందరు మిత్రుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. విహార యాత్ర చేసే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, చతుర్ధాధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసు కుంటాయి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత మెరుగ్గా ఉంటుంది. ఉద్యో గంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. తోబుట్టువులు, సమీప బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ప్రస్తుతం ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, రాశ్యధిపతి గురువుతో పరివర్తన చెందినందువల్ల నెలంతా చాలావరకు యోగదాయకంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనారోగ్యాలు, అనవసర స్నేహాల విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు మీరే ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభ వార్తలు వినడానికి అవకాశం ఉంది. మీ సలహాలు, సూచనల వల్ల కొందరు బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me