ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ - ముగ్గురు మైనర్లు మృతి -

 


ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ - ముగ్గురు మైనర్లు మృతి - ROAD ACCIDENT ON ARAMGHAR FLYOVER

రాజేంద్రనగర్‌ మండలంలో ప్రమాదం, ముగ్గురు మృతి - శివరాంపల్లి వద్ద కొత్త పైవంతెనపై డివైడర్‌ను ఢీకొన్న బైకు - ఇద్దరు అక్కడికక్కడే మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి



Road Accident on Aramghar Flyover : ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని ముగ్గురు మృత్యువాత పడిన ఘటన రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లిలో జరిగింది. ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌పై ఓ ద్విచక్రవాహనం శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్‌ పోల్‌ను ఢీకొట్టి, డివైడర్‌ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు బహదూర్‌పురాకు చెందిన మైనర్లుగా పోలీసులు గుర్తించారు. వీరు మితిమీరిన వేగం, ట్రిబుల్‌ రైడింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. వీరు బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me