వెనక్కి తగ్గిన విద్యాశాఖ..ఈసారికి పాత విధానంలోనే ‘టెన్త్‌’ పరీక్షలు!

 

TG SSC Exams 2025: వెనక్కి తగ్గిన విద్యాశాఖ..

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పదో తరగతి పరీక్షల విషయంలో వెనక్కి తగ్గింది. ఇటీవల పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానాన్ని ఈ ఏడాదికి కాకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ విద్యాశాఖ ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు పూర్తిగా రద్దు, గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మార్పులపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి అమలు చేస్తామని సవరణ ఉత్తర్వుల జారీ చేసింది. రాత పరీక్షకు నూటికి 100 మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని నవంబరు 29న సవరణ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే గ్రేడింగ్ విధానం తొలగింపు విధానం మాత్రం ఈసారి పరీక్షల నుంచే అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. అంటే గతంలో మాదిరిగా గ్రేడింగ్స్ కాకుండా నేరుగా విద్యార్ధులు సాధించిన మార్కులను ప్రకటించనున్నారు. పరీక్షలకు కేవలం మూడున్నర నెలల ముందు ఈ కీలకమైన మార్పులు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈసారి వార్షిక పరీక్షలో 80 మార్కులు, ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కుల చొప్పున ఉంటాయని తెలిపింది. ఈ మార్పులను అన్ని పాఠశాలలు గుర్తించి, తదనుగుణంగా విద్యార్ధులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

ఇక ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్ధులు నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుంది. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు పేపర్లలోపు బ్యాక్ లాగ్స్ ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉంటే రూ. 125 చొప్పున చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.

Previous Post Next Post

Education

  1. AP EAPCET Updates 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి - New!
  2. TG Polycet 2025: నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ, మే 13న ప్రవేశ పరీక్ష - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

Ayyappa English Lyrics

  1. Ayyappa Bhajana / bhajan lyrics in English - New!

نموذج الاتصال

Follow Me