ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు 30.11.2024 (శనివారం) రైతు దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని, అమిస్తాపూర్ గ్రామం లోని సభా ప్రాంగణంలో పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు ఈ విధంగా వున్నాయి.
ఈ సందర్భంగా, సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన పార్కింగ్ ప్రాంతాలను గుర్తించడం, ట్రాఫిక్ మళ్లింపులు సజావుగా కొనసాగేందుకు ప్రత్యేక చర్యలను తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా సభకు విచ్చేయు రైతులు, ప్రజలు, మరియు వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు.
*పార్కింగ్ స్థలాలు*
👉 కామారెడ్డి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, రంగా రెడ్డి మీదుగా హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వచ్చే వాహనాలు జతీయ రహదారి 44 లొ జడ్చర్ల ఫ్లై ఓవర్ ఎక్కకుండా ఎడమవైపు లొ కిందకు దిగి, ఫ్లై ఓవర్ క్రింద రైట్ టర్న్ తీసుకొని మహబూబ్ నగర్ రూట్ లో వచ్చి పిస్తా హౌస్ దగ్గర బై పాస్ లో లెఫ్ట్ టర్న్ తీసుకుని, బై పాస్ ఎండ్ లో లెఫ్ట్ టర్న్ తీసుకొని భూత్పూర్ రోడ్డు లో నేరుగా వస్తూ కొత్త కలెక్టరేట్, మీదుగా అమిస్తాపూర్ శివారులో ఉన్న గిరిధారి వెంచర్ ఎదురుగా వున్న పార్కింగ్-I లో నిలుపవలెను.
👉 మక్తల్, నారాయణపేట నుండి మహబూబ్ నగర్ కి వచ్చే వాహనాలు 1 టౌన్ పోలీసు స్టేషన్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని, నేరుగా భూత్పూర్ వైపు వస్తూ కొత్త కలెక్టరేట్, మీదుగా అమిస్తాపూర్ శివారులో ఉన్న గిరిధారి వెంచర్ ఎదురుగా వున్న పార్కింగ్-I లో నిలుపవలెను.
👉 నాగర్ కర్నూల్ నుండి మహబూబ్ నగర్ వైపు వచ్చే వాహనాలు, జడ్చర్ల ఫ్లై ఓవర్ కిందనుండి మహబూబ్ నగర్ వైపు వచి పిస్తా హౌస్ దగ్గర బై పాస్ లో లెఫ్ట్ టర్న్ తీసుకుని, బై పాస్ ఎండ్ లో లెఫ్ట్ టర్న్ తీసుకొని భూత్పూర్ రోడ్డు లో లెఫ్ట్ వైపుకు టర్న్ తీసుకొని కొత్త కలెక్టరేట్, మీదుగా అమిస్తాపూర్ శివారులో ఉన్న గిరిధారి వెంచర్ ఎదురుగా వున్న పార్కింగ్-I లో నిలుపవలెను.
👉 మహబూబ్ నగర్ నుండి వచ్చే వాహనాలు 1 టౌన్ పోలీసు స్టేషన్ దగ్గర వచ్చాక నేరుగా బూత్పూర్ వైపు వస్తూ కొత్త కలెక్టరేట్, మీదుగా అమిస్తాపూర్ శివారులో ఉన్న గిరిధారి వెంచర్ ఎదురుగా వున్న పార్కింగ్-I లో నిలుపవలెను.
👉 గద్వాల నుండీ వచ్చే వాహనాలు, జాతీయ రహదారి 44 నందు భూత్పూర్ ఫ్లై ఓవర్ దిగగానే వెంటనే లెఫ్ట్ టర్న్ తీసుకుని బూత్పూరు పార్కింగ్-2 నందు నిలుపవలెను.
👉 A.వనపర్తి నుండి కొత్తకోట మీదుగా వచ్చే వాహనాలు బుత్పూర్ ఫ్లై ఓవర్ దిగగానే వెంటనే లెఫ్ట్ టర్న్ తీసుకుని భూత్పూర్ పార్కింగ్-2 నందు నిలుపవలెను.
👉 B.వనపర్తి నుండి బిజినపల్లి మీదుగా వచ్చే వాహనాలు బుత్పూర్ ఫ్లై ఓవర్ దిగగానే వెంటనే లెఫ్ట్ టర్న్ తీసుకుని బూత్పూరు పార్కింగ్-2 నందు నిలుపవలెను.
👉 జనరల్ ట్రాఫిక్ భూత్పూర్ మీదుగా మహబూబ్నగర్ వెళ్ళే వాహనాలన్ని కూడా తేదీ 30-11-2024 నాడు మధ్యహ్నం 1 గంట నుండి సాయంత్రం 8 గంటల వరకు భూత్పూర్-మహబూబ్నగర్ రూట్ లో జడ్చర్ల మీదుగా డైవర్షన్ తీసుకోవాలి, అలాగే మహబూబ్ నగర్- బూతపూర్ రూట్ వెల్లె వాహనలు బైపాస్, పిస్తహౌస్, జడ్చర్ల మీదుగా డైవర్షన్ తీసుకోవాలి.
“పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. భద్రతపరమైన మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ చర్యలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించబడతాయని” తెలిపారు.