డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

 


హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో వస్తు్న్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు.


హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు (Police) మధురానగర్‌ (Madhuranagar)లో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట (Siddipet) ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ (Traffic ACP Suman Kumar) సివిల్ డ్రెస్సులో వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఏసీపీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ ఏసీపీ బ్రీత్ ఎనలైజర్‌ ముందు ఊదకపోవడంతో.. వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి ఏసీపీ సుమన్ కుమార్‌(Suman Kumar)ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అధికారి మద్యం తాగినట్లు తేలడంతో అతనిపై చర్యలకు సిద్దమయ్యారు. అయితే ఈ విషయం మీడియా కంట పడటంతో సోషల్ మీడియా(Social Media)లో ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow