Hyderabad: చందానగర్‌లో విషాద ఘటన..
హైదరాబాద్: చందానగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడవ అంతస్తుపై నుంచి పడి మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివి ప్రైడ్ హోటల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hyderabad: అయ్యో దేవుడా.. బర్త్‌డే పార్టీకి వెళితే వెంటపడిన కుక్క.. చివరకు, కిటికీలోంచి దూకి.. వీడియో
కుక్క వెంటపడటంతో మూడవ అంతస్తు పై నుంచి పడి ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.. స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న అనంతరం ఈ ఘటన జరిగింది..
హైదరాబాద్: చందానగర్‌లో (Chandanagar) విషాద ఘటన (Tragic incident) చోటుచేసుకుంది. కుక్క (Dog) తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడవ అంతస్తుపై నుంచి పడి మృతి (Died) చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని వివి ప్రైడ్ హోటల్లో (Hotel) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చి రామచంద్రపురం అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్న తెనాలికి చెందిన ఉదయ్(23).. ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్‌లోని వివి ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి హోటల్లోని మూడవ అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే వారిని కుక్క తరిమింది. దీంతో భయాందోళనకు గురైన ఉదయ్ హోటల్ మూడవ అంతస్తు బాల్కనీ కిటికీ నుండి కిందకు దూకాడు. తీవ్ర గాయాల పాలైన ఉదయ్‌ను స్నేహితులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ సీసీటీవీ కెమెరాలలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. అసలు హోటల్ మూడవ అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.. ఆ దిశలో కూడా చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ స్నేహితుల స్టేట్‌మెంట్ కూడా పోలీసులు రికార్డు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.