Digigal Condom: ఇది డిజిటల్ కండోమ్.. ఎవరి కోసం? ఎందుకోసమో తెలుసా? రహస్య కెమెరాలు, మైక్రోఫోన్లను బ్లాక్ చేసే ‘కామ్‌డోమ్’



భయం లేని ‘ఏకాంతం’ కోరుకునే వారి కోసమే ఈ యాప్

లాంచ్ చేసిన జర్మన్ సెక్సువల్ హెల్త్ బ్రాండ్ ‘బిల్లీబాయ్’

రహస్య కెమెరాలు, మైక్రోఫోన్లను బ్లాక్ చేసే ‘కామ్‌డోమ్’

ఎటువంటి భయం లేని ఏకాంతం కోరుకునే వారి కోసం జర్మన్‌కు చెందిన సెక్సువల్ హెల్త్ బ్రాండ్ ‘బిల్లీబాయ్’ సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. దీనిపేరు ‘కామ్‌డోమ్’. ‘డిజిటల్ కండోమ్’గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఏకాంత సమయంలో రహస్యంగా ఎవరూ ఆ సీన్లను ఫొటోలు, వీడియోలు తీయకుండా, అక్కడ జరిగే సంభాషణను రికార్డు చేయకుండా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి ఎలాంటి భయాందోళనలు లేకుండా ఏకాంతాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఇప్పటికే 30 దేశాల్లో లాంచ్ అయి ఆదరణ చూరగొంటోంది. త్వరలోనే ఐవోఎస్ వెర్షన్‌లోనూ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది.


ఎలా పనిచేస్తుంది?

 ఏకాంత సమయంలో స్మార్ట్‌ఫోన్‌లోని రహస్య కెమెరాలు పనిచేయకుండా ఈ డిజిటల్ కండోమ్ యాప్ అడ్డుకుంటుంది. బ్లూటూత్ ద్వారా పనిచేసే ఈ యాప్ సమీపంలోని కెమెరాలు, మైక్రోఫోన్లను బ్లాక్ చేస్తుంది. ఏకాంత సమయంలో ఈ యాప్‌ను ఆన్‌ చేసి పక్కన పెట్టేస్తే సరి ఎలాంటి భయం లేకుండా మధుర క్షణాలను ఆస్వాదించవచ్చని యాప్ డెవలపర్ ఫెలిపే అల్మేడా తెలిపారు. 


అయినా.. ఎవరైనా ప్రయత్నిస్తే..

యాప్ ఆన్‌లో ఉన్నప్పటికీ ఎవరైనా రహస్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే యాప్ అలెర్ట్ అవుతుంది. వెంటనే అలారం మోగి యూజర్లను అప్రమత్తం చేస్తుంది. కాగా, ఈ యాప్ ఒకేసారి పలు డివైజ్‌లలోని కెమెరాలు, మైక్‌లను బ్లాక్ చేయగలదు. ఈ యాప్‌పై సోషల్ మీడియా యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాజానికి ఇలాంటివి అవసరమేనని చెబుతున్నారు. ‘ప్రైవేట్’ వ్యవహారాలు సామాజిక మాధ్యమాలకు ఎక్కుతున్న వేళ ఇలాంటి యాప్‌లు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు

Previous Post Next Post

نموذج الاتصال