నూతన విద్యా విధానానికి నాంది.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందనున్న విద్య వ్యవస్థ.
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించేలా మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
పెద్దాయి పల్లి లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి .
ఏదైనా మీడియా సమావేశంలో గానీ నా ఫోన్లో కానీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేరు వింటే భయమేస్తుంది అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా.. ప్రజలకు మేలు జరగకపోతే సొంత ప్రభుత్వం పైన యుద్ధం చేస్తా అనడంతో ఒక అంత భయానికి గురైనట్లు తెలిపారు.
వర్షం పడుతున్న కానీ గొడుగు కప్పుకొని సమావేశంలో ప్రసంగిస్తుండడం విశేషం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ విద్యా విధానంలో భాగంగా నేడు జడ్చర్ల నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర R&B శాఖ మంత్రివర్యులు *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి , యెన్నం శ్రీనివాస్ రెడ్డి , మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ , జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి , జిల్లా ఎస్పీ డి జానకి , జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి పాల్గొన్నారు.